NLG: కేతపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంతవరకు రుణమాఫీ ఎంత మందికి చేశారో శ్వేత పత్రం విడుదల చేయడం లేదని, రైతులకు వెంటనే రైతు భరోసా, మహిళలకు రూ.2500లు ఇవ్వాలన్నారు.