GDWL: గట్టు మండలం ఆరగిద్ద పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు సోమవారం ఆందోళన చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేయాల్సిన చోట కేవలం ఇద్దరే ఉన్నారని దీంతో తమ చదువులు సాగడం లేదని ఆందోళన చెందారు. అక్షరాస్యతలో దేశంలోనే వెనుకబడిన గట్టు మండలాన్ని విద్యా పరంగా అభివృద్ధి చేస్తామన్న పాలకులు అధికారులు ఆ దిశగా ప్రయత్నించడం లేదని ఆవేదన చెందారు.