NZB: కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న టపాసుల దుకాణదారులు సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారులు ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని ఇంఛార్జ్ సీపీ సింధు శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దుకాణదారులు నిబంధనలు పాటించాలన్నారు. అనుమతులు పొందకపోవడం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.