NRML: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 287 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 97 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.