NLG: జిల్లా వ్యాప్తంగా ఈనెల 28న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బండి దీప్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన వివిధ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. 28న ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు ఈలోక్ అదాలత్ను ప్రారంభిస్తారని తెలిపారు.