NRML: జీవో నంబర్ 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని బీఎస్పీ నిర్మల్ జిల్లాధ్యక్షుడు జగన్ మోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 29 జీవో తీసుకువచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్ కోటాలో ఎంపిక చేయకుండా రిజర్వేషన్స్ వరకు పరిమితం చేస్తున్నదన్నారు.