నాగర్కర్నూల్: అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.