ADB: ఆదిలాబాద్ మాల సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిశారు. ఇటీవల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో సంఘం సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సైతం సంఘం అధ్యక్షుడు రమేశ్‌తో పాటు సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు.