JGL: మోతె బైపాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. గాయపడిన వారు ఎల్లారెడ్డిపేట మండల వాసులుగా గుర్తించారు.