»Preparations On For A Grand Sita Rama Kalyanam At Bhadrachalam Temple
Bhadadri: 22 నుంచి భద్రాచల రామయ్య బ్రహ్మోత్సవాలు
భద్రాచలం శ్రీరామ మందిరంలో మార్చి 22వ తేది నుంచి బ్రహ్మోత్సవాలు(Bramhotsavams) జరగనున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం(Seetharamachandra swamy temple) సన్నిధిలో శ్రీరామనవమి(sriramanavami) బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలియుగ వైకుంఠం భద్రాచలం(Bhadrachalam)లో రామయ్య కళ్యాణోత్సవానికి మార్చి 22వ తేది నుంచి ఏప్రిల్ 5వ తేది వరకూ శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను వైభవంగా ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.

మార్చి 22న ఉగాది(Ugadi) పండగను పురస్కరించుకుని నూతన పంచాంగ శ్రవణం ఆలయంలో నిర్వహించనున్నారు. భద్రాచల రామయ్య పెండ్లికి మార్చి 30వ తేదిన ముహూర్తం ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేది వరకూ శ్రీరామ నవమి(sriramanavami) తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను వేడుకగా జరిపేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సీతారాముల కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుకను, వసంతోత్సవాన్ని, డోలోత్సవాన్ని ఘనం జరిపేందుకు ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. సీతారాముల కళ్యాణాని(Seetaraamula Kalyanam)కి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం, ఒక క్వింటాకు పైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేశారు. ఉత్సవాలు(Bramhotsavams), కళ్యాణం, పట్టాభిషేకానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.