నిజామాబాద్ రైల్వే స్టేషన్లో బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న 14 ఏళ్ల బాలికను వరంగల్ పోలీసులకు అప్పగించారు.సామాజిక మాధ్యమాల ద్వారా ఆదిలాబాద్‌కు చెందిన యువకుడి కోసం బాలిక ఇంట్లో చెప్పకుండా నిజామాబాద్ చేరుకుంది. రైల్వే పోలీసులు బాలికను గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు.