పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని 11 వ వార్డు 14వ వార్డు మధ్య మ్యాచ్ ను నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో వార్డు పరిధిలో పోటీ నిర్వహించి విజేతలకు నియోజకవర్గస్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతకు 50 వేల రూపాయల నగదు బహుమతి రన్నర్ కు 25వేల రూపాయల నగదు బహుమతి అందిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులుగెలుపోవటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి తోపాటు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్లు, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.