AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ ఉన్న వారు అర్హులు. రేషన్ కార్డుకు E-KYC తప్పనిసరి. లేదంటే గ్యాస్ ఏజెన్సీల వద్ద లింక్ చేసుకోవాలి. Adhar-Bank ఖాతా లింక్ అయ్యి ఉండాలి. అలా లింకైన ఖాతాలోనే సిలిండర్ కోసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 48 గంటల్లోగా జమ అవుతాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు.