JGL: మధ్యాహ్న భోజన వర్కర్స్ ఏఐటీయూసీ యూనియన్ పిలుపు మేరకు అక్టోబర్ 31న జగిత్యాల కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేయనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎంఈవోలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెన్న మహేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.