NZB: బోధన్ పట్టణంలో గోశాల ప్రాంగణంలో సోమవారం ఒక పిచ్చి కుక్క స్థానికులపై దాడి చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్న పిల్లలతో సహా నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.