NLG: బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామం నుంచి బొమ్మలరామారం వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. అనంతరం మైలారం కింది తండాలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.