KNR: జిల్లాలోని టౌన్-8 సెక్షన్ పరిధి మారుతీనగర్‌లో టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించారు. సెక్షన్ ఏఈ ఫసీ అహ్మద్ పాల్గొని విద్యుత్ భద్రత, పొదుపుపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, బిల్లుల సమస్యలు, కొత్త కనెక్షన్ల కోసం విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని సూచించారు.