KMM: మధిర మండల పరిధిలోని రాయపట్నం గ్రామ ఇసుక రేవు నుండి గత కొన్ని రోజులుగా ప్రతిరోజు రాత్రి సమయాలలో కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.