HYD: హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పరిధి చంద్రగిరినగర్లో ఒక ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ దారుణానికి ఒడిగట్టాడు. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రిన్సిపల్ను నిలదీసి, అందరి ముందే అతనికి దేహశుద్ధి చేశారు.