»Appointment Of Bm Santhosh As Additional Secretary Tspsc
TSPSC అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ నియామకం
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి పదవికి కొత్త ఐఏఎస్ అధికారిని నియమించింది. కార్యదర్శిగా ఐఏఎస్ బీఎం సంతోష్ (BM Santosh) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ (BM Santosh) నియామకం అయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్ టీఎస్పీఎస్సీ (TSPSC) పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే బీఎం సంతోష్‌ను ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతల నుంచి బదిలీ చేశారు. తెలంగాణ(Telangana)లో టీఎస్పీఎస్పీలో(Paper leak)ల వ్యవహారంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో, తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కమిషన్‌లో పది కొత్త పోస్టులను మంజూరు చేసింది.
పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్(Deputy Controller), అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్మర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులు, జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టులకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలుపింది. అలాగే, కొత్త పోస్టులను మంజూరు చేసింది.ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతలను నిర్వరిస్తున్న బి.ఎం.సంతోష్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.