NRML: దిలావర్పూర్ మండల కేంద్రాన్ని పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా దిలావర్పూర్లో మహా ధర్నా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇథనాల్ పరిశ్రమ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలను మొహరించారు.