TG: కొమురంభీం జిల్లా వాంకిడి మండలం దాబాలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థిని శైలజ కుటుంబంతో అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి. MLA కోవ లక్ష్మీ, ITDA పీవో మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే పీవో యువరాజ్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని శైలజ కుటుంబానికి ప్రభుత్వం హామీ ఇచ్చాకే అంత్యక్రియలు నిర్వహించాలని MLA డిమాండ్ చేశారు. కాగా ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స తీసుకుంటూ శ్రైలజ మృతిచెందిన విషయం తెలిసిందే.