MNCL: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు బెల్లంపల్లి COE విద్యార్థి పొట్ట లక్ష్మీనరసింహ ఎంపికయ్యాడు. ఈ నెల 8న కాగజ్ నగర్లో అండర్-14 విభాగంలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్ధిని ప్రిన్సిపల్ విజయ్ సాగర్ అభినందించారు.