HYD: సీతాఫల్మండి డివిజన్ మధురానగర్ కమ్యూనిటీ హాలులో పార్శిగుట్ట సంజీవపురం పద్మశాలి సంఘ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం సందడిగా జరిగాయి. స్వర్ణోత్సవ వేడుకల్లో పలువురు పద్మశాలి సంఘ నాయకులు పాల్గొని మాట్లాడారు. పద్మశాలిలు సంఘటితమై రాజకీయ రిజర్వేషన్లు, హక్కులు సాధించుకోవాలని, పద్మశాలీల అభ్యున్నతి, అభివృద్ధికి కలసికట్టుగా పోరాడాలని కోరారు.