MDK: రామాయంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సోమవారం మట్టి వినాయకులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఇంటింటికి ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని కోరారు.