KMM: ముదిగొండ మండలం కృష్ణాపురం గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను శనివారం మండల తహసీల్దార్ సునీత ఎలిజిబెత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్ధార్ అన్ని కోణాలలో తనిఖీ చేసి, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు మరియు ఆహార విషయాల గురించి విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. విద్యార్థుల విషయంలో సిబ్బంది పూర్తి అప్రమత్తత కలిగి ఉండాలని సూచించారు.