NRML: తనను కలిసేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ఇతరులు బొకేలు, శాలువాలు, ఇతర కానుకలు తీసుకురావద్దని భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ కోరారు. తనపై గౌరవం చూపాలనుకునేవారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్తులకు అవసరమైన నోట్ పుస్తకాలు, స్టేషనరీ, ఇతర విద్యాసామగ్రి విరాళంగా అందించాలని సూచించారు. ఈ సహకారం విద్యార్థులకు ఉపయోగపడుతుందని అన్నారు.