PDPL: జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య మంగళవారం ధర్మారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో 100% పన్నులు వసూలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్‌పై శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, GP ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయం వివరాలను సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమలత, తదితరులు పాల్గొన్నారు.