KMR: భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి శివారులో సోమవారం రాత్రి పులి సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుతోట రామచంద్రం వ్యవసాయ క్షేత్రంలో, మాందాపూర్ వెళ్లే దారిలో ఒక ఆవును పులి కొరికి చంపినట్లు స్థానికులు గుర్తించారు. పులి సంచారంపై గ్రామస్తులు మంగళవారం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.