KMM: పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రముఖ ఆలయాలైన కూసుమంచి, నేలకొండపల్లి, భద్రాచలం, అన్నపురెడ్డిపల్లి, కామేపల్లి, తీర్థాల ఆలయాల్లో భక్తుల కోలాహాలం నెలకొంది. మరొకవైపు భద్రాచలం గోదావరి వద్ద ఆలయ అర్చకులు నదికి హారతిని అందించగా.. కూసుమంచిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు.