VZM: సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు విలువలతో కూడిన విద్య అవసరమని మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతి అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయ ఆవశ్యకతపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటిల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేశారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్ద బడేందుకు విద్యార్థి దశ కీలకమన్నారు.