HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో ఉదయం వేళలోనే అత్యధికంగా ఓపి సేవలు అందుతున్నాయి. ప్రజల సైతం అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఉదయం 4 వేలకు పైగా ఓపి సేవలు పొందుతుంటే, సాయంత్రం 250 దాటడం లేదు. ఫలితంగా ఉదయం రద్దీ విపరీతంగా పెరుగుతుంది. మరోవైపు ప్రత్యేక వైద్య నిపుణుల ఓపి ఛార్జీలు తగ్గించాలని రోగులు కోరుతున్నారు.