KMM: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ, కారేపల్లి సర్కిల్ ఎన్నికల ఇంఛార్జ్ శ్రీనివాసులు కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కామేపల్లి మండలం గోవింద్రాల, బర్లగూడెం గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.