KNR: మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఇవాళ భక్తుల రద్దీ నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. ఉదయం నుంచే తలనీలాలు సమర్పించుకుని, కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలతో పాటు, అనుబంధ ఆలయాల్లో సైతం భక్తుల తాకిడి నెలకొంది.