NGKL: కల్వకుర్తి పట్టణంలోని చారిత్రక గచ్చుబావికి యువత కృషితో పూర్వ వైభవం వస్తోంది. శిథిలావస్థకు చేరిన బావిని సోషల్ మీడియా పిలుపుతో ‘సేవ్ గచ్చుబావి’ పేరిట 52 రోజులుగా యువకులు, మహిళలు శ్రమదానంతో శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. అందరి సహకారంతో స్వచ్ఛమైన నీరు లభించే అవకాశం కలగడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.