WGL: కొన్ని రోజులుగా ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి పాకాల అభయారణ్యంలోకి వెళ్లింది. మూడేళ్ల కిందట పాకాల అడవిలోకి వచ్చిన పులి.. మళ్లీ ఇప్పుడు వచ్చిందని అధికారులు గుర్తించారు. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మీదుగా పాకాల అడవిలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. పులి అడవిలోకి వెళ్లడంతో ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.