SRPT: తిరుమలగిరి మండలం తాటిపాములలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ రూ.20 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు సోమవారం ఎమ్మెల్యే సామేలు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామానికి ఎంపీ నిధులు కేటాయించిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.