BDK: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చర్యలు చేపట్టాలని తాహసీల్దార్ లక్ష్మిరాజయ్య చెప్పారు. వెంకటాపురం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసీల్దార్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు.