MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో ఇవాళ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ మీడియాతో మాట్లాడారు. ఆదివాసీలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు దక్కాలంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 3న ఛలో ఐటీడీఏ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. మహిళలు, యువకులు, ఆదివాసీలు వేల సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.