KMR: సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డిలోని కలెక్టరేట్ ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు.