MNCL: బెల్లంపల్లికి చెందిన సంఘ సేవకుడు కుడిపూడి కొండబాబు సేవారత్న అవార్డుకు శుక్రవారం ఎంపికయ్యారు. కొండబాబు గత 15 ఏళ్లుగా నిసార్థంగా సేవలు చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ సేవాసమితి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. మార్చురి వ్యాన్ ద్వారా మృతదేహాలను ఇండ్లకు ఉచితంగా చేరవేస్తాడు. కొండబాబుకు అవార్డ్ రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.