KMM: మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జనరల్ 11, బీసీ 4, ఎస్సీ 6, ఎస్టీ 1గా కేటగిరీలు ఖరారయ్యాయి. గత రిజర్వేషన్లతో పోలిస్తే ఈసారి అనూహ్య మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. 11, 12 వార్డులు ఎస్సీ నుంచి జనరల్ లేదా బీసీగా మారే అవకాశం ఉంది.