PDPL: సింగరేణి ఆర్జీ-1 ప్రభావిత ప్రాంతమైన సింగిరెడ్డిపల్లిలో రేపు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో జ్వరం, జలుబు, బిపి, షుగర్ వంటి వివిధ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. సింగరేణి యాజమాన్యం చేపడుతున్న ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.