MNCL: బెల్లంపల్లి పట్టణంలో గృహజ్యోతి లబ్ధిదారులకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క లేఖలు పంపించారు. శనివారం విద్యుత్ సిబ్బంది వాటిని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ పథకం ద్వారా రూ.3,593 కోట్ల బిల్లులను ప్రభుత్వం పూర్తిగా భరించి లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు చెల్లించిందని లేఖలో పేర్కొన్నారు. నిరుపేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించడమే పథకం ఉద్దేశమన్నారు.