KMM: చింతకాని మండలం మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన సెక్రటరీగా నాగేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్కెట్ చింతకాని, ముదిగొండ మండలాలకు చేరువలో ఉండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ను మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.