KNR: సంక్రాంతి పండుగకు చైనా మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని శంకరపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రాణాంతకమైన చైనా మాంజా వల్ల పక్షులు, వాహనదారులకు తీవ్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనందం చాటున విషాదాన్ని నింపే ఈ దారాలకు బదులుగా పర్యావరణ హితమైన కాటన్ దారాలను మాత్రమే ఉపయోగించాలన్నారు.