SRPT: మోతే మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆదివారం ఘనంగా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో మండల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.