PDPL: ఓదెల తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ పాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్న సకినారపు మొగిలిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీ హర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొగిలి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు తహసీల్దార్ నివేదిక ఆధారంగా విధుల నుంచి తప్పించారు. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి పర్మిషన్ లేకుండా వెళ్లకూడదని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.