WNP: పాన్ గల్ మండలం రేమద్దులలో నాసిరకంగా నిర్మించిన హైస్కూల్ భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని SFI, DYFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు వనపర్తి కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రేమద్దుల నుంచి కలెక్టరేట్ వరకు 18కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏవోకు సమర్పించారు.