JGL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన నీరటి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షుడు మరిపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందేలా చూడాలన్నారు.